దేశంలో ఆన్ లైన్ షాపింగ్ పైపైకి…
దేశంలో ఆన్ లైన్ షాపింగ్ పైపైకి…
రోజురోజుకు ఆన్ లైన్ షాపింగ్ మీద జనానికి మోజు పెరుగుతోంది. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుండడంతోఆన్
లైన్ లోనే షాపింగ్ చేయడానికి జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో, గతంతో
పోల్చుకుంటే ఈ కామర్స్ సంస్థలు భారీగా గ్రోత్ సాధించాయి. ప్రస్తుతం మన
దేశంలో ఏడాదికి దాదాపు 13 బిలియన్ డాలర్ల ఈ కామర్స్ బిజినెస్ జరుగుతుండగా,
2021 నాటికి ఈ బిజినెస్ 90 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు
ఈటైలింగ్ ఇండియా అనే సంస్థ సర్వే చేసి చెప్పింది. ఈ కామర్స్ సైట్లలో
స్మార్ట్ ఫోన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉందంట. అలాగే, ఇంటర్నెట్ అడ్వర్
టైజ్మేంట్ బిజినెస్ కూడా పెరిగిపోతుందని ఈటైలింగ్ ఇండియా సంస్థ చెప్పింది.
No comments:
Post a Comment