Monday 27 October 2014

ఇక నుండి నోకియా పేరు కనపడదు!

microsoft lumia
ఇక నోకియా పేరు పోయి మైక్రోసాఫ్ట్‌ పేరు స్మార్ట్‌ ఫోన్లపై రానుంది. నోకియా మొబైల్‌ కంపెనీ బ్రాండ్‌ ని మైక్రోసాఫ్ట్‌ 10 ఏళ్ల పాటు వాడుకోనుంది. ఈ ఏడాది ఏప్రిల్లో దీనికి సంబంధించిన బిజినెస్‌ అగ్రిమెంట్‌ పూర్తైంది. దీంతో మైక్రోసాఫ్ట్‌ ఇక స్మార్ట్‌ ఫోన్లకు నోకియా పేరును తొలగించాలని నిర్ణయించింది. బేసిక్‌ మోడల్‌ మొబైల్‌ ఫోన్లకు మాత్రమే నోకియా పేరు ఉంటుంది. ఆపై బ్రాండ్లన్నింటికీ మైక్రోసాఫ్ట్‌ పేరు ఉంటుందని కంపెనీ తెలిపింది. త్వరలో మైక్రోసాఫ్ట్‌ లూమియా పేరుతో ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయని కూడా తెలిపింది.

తక్కువ బడ్జెట్ లో గేరు లేని కార్లు


low budjet cars
















కార్లంటే గేర్లు ఉండాల్సిందే. అయితే ఇప్పుడు పెరిగిపోతున్న ట్రాఫిక్ లో నగర రోడ్లపై గేర్ ఉన్న కార్లను నడపాలంటే కష్టమే. అందుకే కంపెనీలు ఆటోమేటిక్ కార్లపై దృష్టిపెట్టాయి. తక్కువ బడ్జెట్ లో కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లు ఏంటో ఓ సారి చూద్దాం.
1. మారుతీ సుజుకీ కొత్త అల్టో కె 10 : అల్టో కె 10లో మార్పులు చేర్పులు చేసింది మారుతీ. ఈ కొత్త కె 10 కారు వచ్చే నెల్లో మార్కెట్లోకి రానుంది. సెలీరియో తరహాలో ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉండటం ప్రత్యేకత. అంతేకాదు పాత అల్టో తో పోలిస్తే ఈ కొత్త కె-టెన్ 75 కిలోల బరువు తగ్గించుకొని లైట్ వెయిట్ తో డిజైన్ చేయబడింది. అంతేకాదు మంచి ఇంధన సామర్థ్యం కూడా ఇవ్వగలదని ప్రకటించింది. ఈ గేర్ లేని కారు లీటర్ కు 24 కి.మీ మైలేజీ ఇవ్వగలదు. ధర కూడా రూ.3-3.5 లక్షల లోపు ఉండవచ్చని భావిస్తున్నారు.
2. మారుతీ సుజుకీ సెలీరియో : AMT ఫీచర్ తో వచ్చిన తొలికారు సెలీరియో. దేశంలోనే మొదటిసారిగా మారుతీసుజుకీ ఈ కారును ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఈకారు మంచి రైడ్ ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇక మైలేజీ లీటర్ కు 23.1 కి.మీ ఇస్తోంది. ధర రూ. 4.49 లక్షలుగా ఉంది.
3. మారుతీ సుజుకీ రిట్జ్ : రిట్ట్ జలో ఆటోమేటిక్ వర్షన్ VXi వేరియంట్ లో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ , పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, ఏబీఎస్, ఈబీడీ, 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 5.76 ( ఎక్స్ షోరూం , ఢిల్లీ )
4. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 : దేశంలో మారుతీ సుజుకీ తర్వాత ఎక్కువ కార్ల సేల్స్ జరిపేది హ్యుందాయ్. ఇప్పుడు ఈ కంపెనీ కూడా గ్రాండ్ ఐ 10లో 4గేర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను తీసుకువచ్చింది. మారుతీ తరహాలోనే హ్యుందాయ్ కూడా తన లేటెస్ట్ మోడల్స్ లో ఏఎంటీ ఫీచర్ ను తీసుకువస్తోంది. గ్రాండ్ ఐ10 ఆటోమేటిక్ కారు ధర రూ.5.92 లక్షలు ( ఎక్స్ షోరూం, ఢిల్లీ )
5. హోండా బ్రియో : లుక్ లోనూ, డ్రైవింగ్ పరంగానూ బ్రియో ముచ్చటైన కారని ఆటోమొబైల్నిపుణులు చెబుతుంటారు. సిటీ తరహాలోనే బ్రియోలోనూ iVTEC ఇంజిన్ ఉంది. 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల బ్రియో లీటర్ కు 16.5 కి.మీ మైలేజీ నిస్తుంది. బ్రియో ఆటోమేటిక్ కారు ధర రూ. 6.05 లక్షలు ( ఎక్స్ షోరూం, ఢిల్లీ )
6. నిస్సాన్ మైక్రా : నిస్సాన్ కూడా ఏఎంటీ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. మైక్రా సీవీటీ పవర్ లో 1.2 లీటర్, 75బీహెచ్ పీ, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, కీ లెస్ ఎంట్రీ స్టాట్, బ్లూటూత్ టెలిఫోన్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తదితర ఫీచర్స్ ఉన్నాయి.దీని ధర రూ.6.39 లక్షలు ( ఎక్స్ షోరూం, ఢిల్లీ )
7. టాటా జెస్ట్ : టాటా జెస్ట్ డీజిల్ కారులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది. మారుతీ సుజుకీ సిలీరియో తరహాలో అవరసమైతే ఆటోమేటిక్ నుంచి మ్యానువల్ ట్రాన్స్ మిషన్ గానూ మార్చుకోవచ్చు. లీటర్ కు 23 కిమీ మైలేజీ ఇవ్వగల జెస్ట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కారు ధర రూ. 7.3 లక్షలు( ఎక్స్ షోరూం, ఢిల్లీ )







దేశంలో ఆన్ లైన్ షాపింగ్ పైపైకి…

దేశంలో ఆన్ లైన్ షాపింగ్ పైపైకి…

online shoping

రోజురోజుకు ఆన్ లైన్ షాపింగ్ మీద జనానికి మోజు పెరుగుతోంది. ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుండడంతోఆన్ లైన్ లోనే షాపింగ్ చేయడానికి జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో, గతంతో పోల్చుకుంటే ఈ కామర్స్ సంస్థలు భారీగా గ్రోత్ సాధించాయి. ప్రస్తుతం మన దేశంలో ఏడాదికి దాదాపు 13 బిలియన్ డాలర్ల ఈ కామర్స్ బిజినెస్ జరుగుతుండగా, 2021 నాటికి ఈ బిజినెస్ 90 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నట్లు ఈటైలింగ్ ఇండియా అనే సంస్థ సర్వే చేసి చెప్పింది. ఈ కామర్స్ సైట్లలో స్మార్ట్ ఫోన్స్ కి ఎక్కువ డిమాండ్ ఉందంట. అలాగే, ఇంటర్నెట్ అడ్వర్ టైజ్మేంట్ బిజినెస్ కూడా పెరిగిపోతుందని ఈటైలింగ్ ఇండియా సంస్థ చెప్పింది.

ఫేస్‌బుక్ ద్వారా డబ్బులు పంపే విధానం

ఫేస్‌బుక్ ద్వారా డబ్బులు పంపే విధానం

facebook money transfer

 

ఆప్తులకు, స్నేహితులకు, ఇతర వ్యాపార లావాదేవీలు జరపడానికి బ్యాంక్‌కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారా?.. మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సమయం మించిపోయిందా?.. మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి బ్రాంచి కోడ్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తదితర విషయాలపై మీకు అవగాహన లేదా? అయితే ఇలాంటి సందర్భాల్లో నగదును సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఫేస్‌బుక్ దోహద పడుతుంది. ఇందుకు కొటక్ మహీంద్రా వారు అవకాశం కల్పిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా….
►ఇందుకు మీరు https://www.kaypay.com
►వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవ్వాలి.
►ఇక్కడ మీకు లాగిన్ విత్ ఫేస్‌బుక్ ఆప్షన్ వస్తుంది.
►మీరు ఫేస్‌బుక్ అకౌంట్‌తో లాగిన్ కావాలి.
►మీ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవడానికి
►కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
►మీ బ్యాంక్ పేరును సెలెక్ట్ చేసుకోవాలి.
►ఇక్కడ అకౌంట్ నెంబరు, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నంబరుతోపాటు ఎంఎంఐడీ నెంబరు ఇవ్వాలి.
►ఇందుకు మీరు ఐడీని ఎస్‌ఎంఎస్ ద్వారా పొందాల్సి ఉంటుంది.
నగదు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా…
►మీ రిజిస్ట్రేషన్ అయిన తరువాత మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఉన్న మిత్రులకు మీరు నగదు
►బదిలీ చేసుకునే అవకాశం కలుగుతుంది.
►మీరు నగదు పంపాల్సిన వ్యక్తిని ఎంచుకుని
►అతని అకౌంట్ నంబరును ఎంటర్‌చేయాలి.
►మీరు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకున్నా ఇక్కడ పొందుపరచవచ్చు.
►ఇక మీరు ఒన్ టైమ్ పాస్‌వర్డ్‌ను రూపొందించుకోవాల్సి ఉంటుంది.
►ఇందుకు మీరు బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకోగానే ఓటీపీ కోసం
► ఎస్‌ఎంఎస్ చేసే విధానాన్ని చూపిస్తుంది.
►దాన్ని అనుసరించి మీరు ఓటీపీ రూపొందించుకోవాలి.
►మీ మొబైల్‌కు వచ్చిన పాస్‌వర్డ్‌ను మీరు ఎంటర్ చేస్తే నగదు బదిలీ అవుతుంది.
►మీరు నగదు పంపే వ్యక్తి కేపేలో రిజిస్టర్ లేకపోతే అతని ఫేస్‌బుక్
►అకౌంట్‌కు సమాచారం వెళ్తుంది.
►సంబంధిత వ్యక్తి 48 గంటల్లో kaypayలో రిజిస్టర్ అవ్వాలి.
►ఒక వేళ కాని పక్షంలో తిరిగి మీ డబ్బులు మీ అకౌంట్‌కు చేరుతాయి.
సూచనలు…
►ప్రస్తుతానికి ఈ సదుపాయం కేవలం 28 బ్యాంకులకు మాత్రమే ఉంది.
►ఇది 24 గంటలూ పని చేస్తోంది.
►నగదు పంపేవారు రోజుకు రూ. 2,500, నెలకు రూ.25 వేల వరకు మాత్రమే నగదును బదిలీ చేసుకునే అవకాశం ఉంది.
►ఈ విధానం ద్వారా నెల మొత్తంలో ఎప్పుడైనా రూ.25 వేలు అందుకోవచ్చు.
►24 గంటల్లో మీ నగదు బదిలీ పూర్తి అవుతుంది.
►మీ పేరు కాని, మీరు బదిలీ చేయాలనుకునే వారి పేరు కానీ, బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్రాంచ్ కోడ్ కాని అందించాల్సిన అవసరం లేదు.
►టువే సెక్యూర్డ్ పాస్‌వర్డ్ సిస్టమ్ ఉండడం వల్ల సేఫ్.
►అన్ని లావాదేవీలు కొటక్ మహీంద్రా సర్వర్ నుంచే ఆపరేట్ అవుతాయి.
ఉదాహరణకు..
►మీది ఎస్‌బీఐ అకౌంట్ అయితే MMID SBI అని టైప్ చేసి 9223440000కు మెసేజ్ చేయాలి.
►బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సమయంలో మీరు ఏ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నారో దాని నుంచే మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
►mmid పొందాలంటే మీ ఫోన్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్‌కు లింక్ అప్ అయి ఉండాలి.
►ఎంఎంఐడీ కోసం ప్రతి బ్యాంక్‌కు మెసేజ్ చేయాల్సిన నంబర్ ఉంటుంది. సంబంధిత నంబర్ బ్యాంక్ పేరు ఎంచుకోగానే మీకు కనిపిస్తుంది.
►ఇప్పుడు మీ మొబైల్‌కు ఏడు అంకెలు గల mmid (mobile money identifier)-వస్తుంది.
►దీన్ని ఎంటర్ చేశాక తరువాత సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్‌ను
►సెలక్ట్ చేసుకుని ఎంటర్ చేయాలి.
► ఇక మీ అకౌంట్ రిజిష్ట్రర్ అయిపోయినట్లే.

అందరికి ఉపయోగపడే ఈ అర్టికల్ ని షేర్ చేయ్యండి..